మహర్షి కోసం ప్రత్యేకమైన సెట్ !

Published on Nov 1, 2018 12:21 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ గత కొద్దీ రోజులుగా యూఎస్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ తుది దశకు చేరుకుంది. నవంబర్ మొదటి వారంలో చిత్ర యూనిట్ ఇండియా కు తిరిగి రానుంది.

ఇక ఈచిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్ లో జరుగనుంది. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబించేలా రూపొందించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగనుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ , అల్లరి నరేష్ లతో పాటు ఇతర నటీనటుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :