నాగ్ సినిమా కోసం ప్రత్యేక సెట్ !

Published on Jun 2, 2021 7:02 am IST

కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ యాక్షన్ డ్రామా కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ సెట్ తాలూకు యాక్టివిటీస్ అన్నీ ప్రవీణ్ సత్తారు దగ్గర ఉండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. జులై సెకెండ్ వీక్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

కాబట్టి, జులై ఫస్ట్ వీక్ లోపు ఈ సెట్ ను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి అయింది. ఐతే ఆ షెడ్యూల్ లో కొంత భాగం షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూర్తీ కాగానే నాగ్ “బంగార్రాజు” సినిమాని స్టార్ట్ చేస్తాడట. మొత్తానికి నాగార్జున ఈ సారి గట్టిగానే వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :