చరణ్ పుట్టినరోజు కానుకగా స్పెషల్ సాంగ్

Published on Mar 26, 2020 2:05 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ నెల 27న కావడంతో తొలుత అభిమానులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ రద్దు చేసుకోవాలని రామ్ చరణ్ నేరుగా అభిమానులని విజ్ఞప్తి చేశారు. దీంతో ఫ్యాన్స్ అన్ని రకాల కార్యక్రమాలను నిలిపివేసుకున్నారు. పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితం కావాలని అభిమానులు డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగానే చరణ్ బర్త్ డే కోసం స్పెషల్ సాంగ్ సిద్దం చేశారు. ఈ పాటను ఈరోజు సాయంత్రం 4 గంటలకు మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఈ పాటతోనే చెర్రీ పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక నిన్న విడుదలైన ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దానికి కంటిన్యూషన్ అన్నట్టు ఈరోజు సాంగ్ రానుండటంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More