మహేష్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ !

Published on Aug 8, 2020 9:55 pm IST

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను రేపు ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంకు సంబంధించిన అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ గురించి మహేష్ ఇటీవలే స్పందిస్తూ.. ‘ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు. ఈ మాటలను బట్టి పై కథాంశం నిజమేనేమో అనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More