‘బిగ్ బాస్ 5’ సీజన్ లో కంటెస్టెంట్స్ లిస్ట్ !

‘బిగ్ బాస్ 5’ సీజన్ లో కంటెస్టెంట్స్ లిస్ట్ !

Published on Feb 1, 2021 10:00 AM IST

BigBoss

బిగ్ బాస్ తెలుగు -5 సీజన్ కి డేట్ ఫిక్స్ అయిందని.. స్టార్ మా బిగ్‌బాస్ 5 సీజన్‌ కు కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ సారి షోలో ఉత్కంఠత పెంచేందుకు నిర్వాహకులు భారీగా స్కెచ్ లను సిద్ధం చేస్తున్నారట. బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్‌ లాస్ట్ ఎపిసోడ్ వరకూ అలాగే ఉంచాలని మేకర్స్ సిద్ధం అవుతున్నారట. అలాగే కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ జర్నీని కూడా ఈ సారి కొత్తగా ప్లాన్ చేయబోతున్నారట. ఇక బిగ్ ‌బాస్ మొదలైందంటే చాలు అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేస్తున్నారట. ప్రముఖ టీవీ హోస్ట్ యాంకర్ రవి, హైపర్ ఆది మరియు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్లను ఈ సంవత్సరం కంటెస్టెంట్స్ లో పరిశీలిస్తున్నారట. ఇక రీసెంట్ గా ‘మా టీవీ’ వారు తమ అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ నిర్వహించింది. అయితే ఈ పోల్ కి వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. మేం షో మిస్ అవుతున్నాం అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. దీంతో అతి త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా సన్నాహాలు చేసుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు