చిరు 151వ సినిమా మొదలయ్యేది అప్పుడేనా ?

25th, April 2017 - 09:30:53 AM


మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం 150’ చిత్రంతో పూర్తి సంతృప్తి చెందిన మెగా అభిమానులు ప్రస్తుతం ఆయన 151వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అమితాసక్తి, భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ‘ధృవ’ చిత్రంతో చరణ్ కి కీలకమైన హిట్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే తాజాగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాటల ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మించనున్న నిర్మాత రామ్ చరణ్ తేజ్ రాజమండ్రి షూటింగ్ షెడ్యూల్లో అభిమానుల్ని కలిసినప్పుడు చిరు 151వ సినిమాను ఆగష్టులో మొదలుపెడతామని అన్నారట. ఒకవేళ ఆగష్టులోనే మొదలుపెడితే అది ఆ నెల 22న తేదీ చిరంజీవి పుట్టినరోజు నాడే ఉండే అవకాశముంది. అయితే ఈ వార్తపై మెగా క్యాంపు నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వెలువడలేదు.