హాలీవుడ్ సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ హీరో ఫ్రాంచైజ్ చిత్రాల్లో స్పైడర్ మ్యాన్ కూడా ఒకటి. మార్వెల్, సోనీ సంస్థ నుంచి ఇప్పుడు రాబోతున్న సరికొత్త చిత్రమే స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా తాలూకా ట్రైలర్ మొన్న సాయంత్రం విడుదల అయ్యింది. మరి ఈ ట్రైలర్ ఫైనల్ గా ఒక కనీ వినీ ఎరుగని రేంజ్ రెస్పాన్స్ ని అందుకున్నట్టు తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ అన్ని ప్లాట్ ఫామ్ లలో కలిపి ఏకంగా ఈ ట్రైలర్ కి 718 మిలియన్ వ్యూస్ వచ్చాయట. ఇది ప్రపంచ సినిమా దగ్గరే ఓ సినిమాకి 24 గంటల్లో నెవర్ బిఫోర్ రెస్పాన్స్ అని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్ టాక్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో రెస్పాన్స్ కలిసి ఈ రేంజ్ వచ్చిందట. ఇక ఈ సినిమా విడుదలకి ముందే ఈ రేంజ్ లో హైప్ ఉంటే రానున్న జూలై లో మేనియా ఎలా ఉంటుందో చూడాలి.


