మరోసారి టాప్ లో ట్రెండ్ అవుతోన్న “స్పిరిట్”

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలు చేస్తూ కెరీర్ లో బిజీగా దూసుకు పోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన సలార్ మూవీ వచ్చే నెల థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ పాన్ ఇండియా స్టార్ హీరో లిస్ట్ లో కల్కి 2898AD తో పాటుగా, స్పిరిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

అయితే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ అన్ స్టాపబుల్ లో చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ మూవీ హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో స్పిరిట్ హ్యాశ్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 కి వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా చేయబోయే స్పిరిట్ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version