తమిళనాట 450 పైగా స్క్రీన్లలో రిలీజ్ కానున్న ‘స్పైడర్’ !

20th, September 2017 - 08:53:57 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’ చిత్రం ఈ నెల 27న భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు తెలుగునాట విడుదలను ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారో తమిళనాడులో కూడా అంతే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. చిత్రం మొదటిరోజు సుమారు 450కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది. మహేష్ ఈ చిత్రంతో కోలీవుడ్లో అధికారికంగా లాంచ్ అవుతుండటంతో ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక క్రేజ్ విషయానికొస్తే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో తమిళ ప్రేక్షుకుల్లో కూడా ఈ సినిమా పట్ల అంతే క్రేజ్ ఉంది. మురుగదాస్ దర్శకత్వం చేయడం, తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందటం, విరివిగా ప్రచారాలు నిర్వహించడంతో సినిమాకు ఈ స్థాయి క్రేజ్ లభించింది. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ చిత్రం రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.