అరబిక్ లో కూడా డబ్ అవుతున్న ‘స్పైడర్’ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎంతటి అంచనాలున్నాయో తెలిసిన సంగతే. ఆ అంచనాలకు తగ్గట్టే మేకర్స్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 భారీ ఎత్తున విడుదలచేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పటికే మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేస్తున్నారు.

వీటితో పాటే అరబిక్ భాషలో కూడా డబ్ చేయనున్నట్టు తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో తెలిపారు దర్శకుడు మురుగదాస్. అన్ని భాషలతో పాటే గల్ఫ్ దేశాల్లో కూడా సినిమా సెప్టెంబర్ 27నాడే సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తుండగా హారీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.