స్పైడర్ వైజాగ్ కలెక్షన్స్ వివరాలు


మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద స్పైడర్ చిత్ర ఎదురీత కొనసాగుతోంది. తొలిరోజు ఈ చిత్రానికి మంచి వసూళ్లే లభించాయి. కానీ ఆ తరువాత నెగిటివ్ టాక్ రావడంతో చిత్ర వసూళ్లపై ప్రభావం పడింది. తాజా సమాచారం ప్రకారం కీలకమైన వైజాగ్ ఏరియాలో ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం 2.5 కోట్లని మాత్రమే వసూలు చేసింది.

అసలైన సెలవు దినాలు నేడు మొదలు అయ్యాయి. శని, ఆది వారలు ఈ చిత్రానికి కీలకంగా మారనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ కావడంతో చిత్ర వసూళ్లపై తీవ్రమైన ప్రభావం పడింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.