ఆగస్ట్ 28 కి ఆహా లో “SR కళ్యాణ మండపం” వచ్చేస్తోంది!

Published on Aug 23, 2021 11:25 am IST


శ్రీధర్ గాదె దర్శకత్వం లో కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం SR కళ్యాణ మండపం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ చిత్రం త్వరలో ఆహా వీడియో లో డిజిటల్ ప్రీమియర్ కానుంది అంటూ వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రకటన సైతం ఆహా వీడియో చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రం ఎప్పుడు డిజిటల్ స్ట్రీమ్ కానుంది అనే దాని పై ఒక క్లారిటీ వచ్చింది.

ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న SR కళ్యాణ మండపం చిత్రం ఈ నెల 28 వ తేదీన వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆహా వీడియో చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నో సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను అందించిన ఆహా వీడియో ఇప్పుడు SR కళ్యాణ మండపం ను త్వరలో ప్రసారం చేయనుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్ర లో నటించారు.

సంబంధిత సమాచారం :