డే 1 చాలా మంచి వసూళ్లే రాబట్టిన ‘S R కళ్యాణమండపం’

Published on Aug 7, 2021 5:04 pm IST

మళ్ళీ తెలుగు స్టేట్స్ థియేటర్ తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో గత వారం నుంచి మళ్ళీ సినిమాలు విడుదల కూడా అవుతూ వస్తున్నాయి. మరి అలా నిన్ననే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, మన తెలుగు బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా “ఎస్ ఆర్ కళ్యాణమండపం” కూడా రిలీజ్ అయ్యింది.

చాలా మంచి అంచనాలతో రిలీజ్ కాబడిన ఈ చిత్రం మొదటి రోజే అద్భుతమైన స్పందనను అందుకుంది. అయితే టాక్ ని పక్కన పెడితే కిరణ్ కి హీరోగా మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. విడుదల కాబడ్డ మేజర్ ప్లేస్ లు అన్నిటిలో కూడా హౌస్ ఫుల్స్ పడుతూ మొదటి రోజే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీలో 1.6 కోట్ల షేర్ ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే రాబట్టినట్టుగా పి ఆర్ టీం చెబుతున్నారు.

ఇది నిజంగా మంచి విషయం అని చెప్పాలి. పెద్ద హీరోల సినిమాలకు ముందు మరిన్ని ఈ తరహా సినిమాలకు ఈ చిత్రం ఆద్యం పోసినట్టే అని చెప్పాలి. ఇక ఈ రెండు రోజులు కూడా వీకెండ్ కావడం ఈ సినిమాకి ఉన్న టార్గెట్ సునాయాసంగా అందుకుంటుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి మాత్రం కిరణ్ అబ్బవరం కి మంచి ఆదరణను తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. ఇక మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :