“ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Jul 25, 2021 11:24 pm IST


కిరణ్ అబ్బవరం హీరోగా, ప్రియాంక జవల్కార్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. ఈ చిత్రం ఆగస్ట్ 6 న థియేటర్ల లోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కి సంబంధించిన ముహూర్తం ను ఖరారు చేయడం జరిగింది. జులై 28, ఉదయం 11:05 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

శ్రీధర్ గాదె దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని థియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రమోద్ మరియు రాజు లు ఎలైట్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మించారు. అయితే ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :