ఆర్ఎక్స్ 100 తరువాత యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న రెండవ చిత్రం హిప్పీ. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం లోని స్పెషల్ సాంగ్ లో శ్రద్దా దాస్ , కార్తికేయ తో కలిసి స్టెప్పులు వేస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
కోలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కలై పులి ఎస్ తాను ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.


