ఈ విజయంతోనైనా ఆ హీరోకి బ్రేక్ వస్తుందా…!

Published on Jun 30, 2019 3:00 am IST

శ్రీవిష్ణు,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నివేదా థామస్,నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా తెరకెక్కిన “బ్రోచేవారెవరురా” మూవీ నిన్న విడుదలైంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరక్కించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో శ్రీవిష్ణు ఈ చిత్రంతో ఓ మంచి విజయం తనఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. ఐతే కనీసం ‘బ్రోచేవారెవరురా’ మూవీ తరువాతైనా హీరో శ్రీవిష్ణు కి బ్రేక్ వస్తుందా లేదా అనేది ఆసక్తికరం.

శ్రీవిష్ణు “అప్పట్లో ఒకడుండేవాడు”, మెంటల్ మదిలో” వంటి విజయవంతమైన విభిన్నమైన చిత్రాలలో నటించారు. ఆ చిత్రాలకు అలాగే అతని నటనకు క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందాయే కానీ హీరో గా ప్రేక్షకులలో అంత గుర్తింపు రాలేదు. సినిమాల ఎంపిక, పాత్రల విషయంలో శ్రీవిష్ణు సరైన నిర్ణయాలే తీసుకుంటున్నా కానీ ఆయనకి రావాల్సినంత ఫేమ్ ఐతే రాలేదనే చెప్పాలి. మరి ఈసారైనా శ్రీవిష్ణు సోలో హీరోగా నిలబడతాడో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More