Vishnu Vinyasam: మరో వెరైటీ టైటిల్‌తో వస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ కూడా చెప్పారుగా..!

Vishnu Vinyasam

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు, అందించే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ ప్రకటించారు. యదునాథ్ మారుతి రావు డైరెక్ట్ చేస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రానికి విష్ణు విన్యాసం(Vishnu Vinyasam) అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను వారు రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో శ్రీ విష్ణు(Sree Vishnu) వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్యాలను నమ్మే వ్యక్తిగా మనకు కనిపించబోతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక ఆయన తన పాత్రలో చేయబోయే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఫన్ రైడ్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ నయన్ సారిక(Nayan Sarika) హీరోయిన్‌గా నటిస్తుండగా మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 2026లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version