లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన శర్వా “శ్రీకారం” టీం!

Published on Oct 27, 2020 12:09 pm IST

మన టాలీవుడ్ యంగ్ తాళాంరెడ్ హీరోల్ ఒకరైన శర్వానంద్ ఇపుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మంచి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ ట్రాక్ లో పడ్డ ఈ హీరో తన సినిమాలకు మంచి బజ్ ను తెచ్చుకోగలుగుతూ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ లను ఓకే చేస్తున్నాడు.

అలా లేటెస్ట్ గా శర్వానంద్ ఓకే చేసిన చిత్రం “శ్రీకారం”. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ లాంగ్ షెడ్యూల్ ను వారు ఇపుడు పూర్తి చేసేసినట్టు తెలుస్తుంది.

ఇద్దరు హీరో హీరోయిన్లు పాల్గొన్న ఈ లాంగ్ షెడ్యూల్ లో చాలా మంది నటీనటులు మరియు టెక్నిషియన్స్ పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితితుల్లో కూడా ఇలా పాల్గొని ఈ ఛేడ్యూల్ ను పూర్తి చేసేలా సహకరించినందుకు గాను నిర్మాతలు రామ్ ఆచంట మరియు గోపి ఆచంటలు వారి హార్డ్ వర్క్ కు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More