మరోసారి మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన శ్రీముఖి..!

Published on Jul 3, 2021 12:29 am IST


ప్రముఖ టీవీ యాంకర్, బిగ్‌బాస్ సీజన్-3 రన్నరప్ శ్రీముఖి.. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీవీలో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసే ఈ అమ్మడికి మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం టీవీతో పాటు అటు వెండితెరపై కూడా మెరవాలని చూస్తున్న ఈ బ్యూటీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది.

అయితే ఈ మధ్యకాలంలో తన డాన్స్ మూమెంట్స్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్న శ్రీముఖి తాజాగా మరోసారి తన మాస్ స్టెప్పులతో దుమ్మురేపింది. చిటాపటా చినుకులతో ఏడ ఉన్నవురో రాతిరి, ఏడ తిన్నవురో రాతిరి అనే పాటకు ఢీ ఫేం పండుతో కలిసి తీన్మార్ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :