భీమ్లా డైరెక్టర్ తో బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ మూవీ లాంచ్

Published on Jun 1, 2023 10:46 pm IST

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల ఛత్రపతి హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఆయన తన నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తారు అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. కాగా నేడు తన నెక్స్ట్ మూవీని భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తో అనౌన్స్ చేసి లాంచ్ చేసారు బెల్లంకొండ శ్రీనివాస్.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. నేడు అధికారికంగా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షాట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ కొట్టి మేకర్స్ కి స్క్రిప్ట్ ని అందించగా యువ దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. మరొక యువ దర్శకడు అనిల్ రావిపూడి కూడా ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కాగా ఈమూవీ యొక్క రెగ్యులర్ షూట్ జూన్ రెండవ వారం నుండి ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :