రామ్ చరణ్, శ్రీనువైట్ల పై టాప్ రైటర్ ప్రశంశలు

ram-charn-srinu-vatila

టాలీవడ్ టాప్ రైటర్స్ లో ఒకరుగా మంచి పేరు సంపాదించుకున్న రైటర్ గోపి మోహన్. గోపి మోహన్ – కోన వెంకట్ కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 9వ సినిమాకి కథని అందించిన విషయం ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాకి కమర్షియాలిటీకి పర్ఫెక్ట్ కామెడీని మిక్స్ చేసి చెప్పగల శ్రీనువైట్ల డైరెక్టర్. ఇప్పటివరకూ ఈ సినిమాలోని 2 పాటలని, ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని సీన్స్ ని షూట్ చేసాం అని రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే తెలిపాడు.

ఈ షూట్ చేసిన రషెష్ చూసిన రైటర్ గోపి మోహన్ ఈ చిత్ర టీంపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ‘రామ్ చరణ్ 9వ సినిమా రషెష్ చూసాను.. నేను చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి సినిమాకి రైటర్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీనువైట్ల ప్రతి సీన్ పై మంచి కమాండ్ తో ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడు. రామ్ చరణ్ చూడటానికి సూపర్బ్ గా ఉన్నాడు. చరణ్ స్టైల్ మరియు డాన్సుల్లో అతని ఎనర్జీ చూసి ప్రేమలో పడిపోయాను. రకుల్ ప్రీత్ సినిమాకి ఫ్రెష్ నెస్ ని జత చేసింది. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ ఫెంటాస్టిక్ అని’ గోపి మోహన్ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా రాకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. నదియా, కృతి కర్భంద ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్, డివివి దానయ్య నిర్మాత.

Exit mobile version