లెజండరీ నటి శ్రీదేవి నటించిన రివెంజ్ థ్రిల్లర్ ‘మామ్’. ఈసినిమాలో నటన కుగాను ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు. ఇది ఆమెకు 300వ సినిమా కావడం విశేషం. 2017 లో విడుదలైన ఈచిత్రం మంచి రివ్యూస్ తో విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ చైనా లో మార్చి 22 న విడుదలచేయనుంది. రవి ఉద్యావర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుగాను ఆయనకు కూడా ఈసినిమా తో జాతీయ అవార్డు లభించింది. ఇక ఈ చిత్రం 75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో భాగంగా ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ప్రదర్శింపబడింది.


