సిరితో బ్రేకప్‌కి శ్రీహాన్ రెడీ.. ఆ పనికి సంకేతం అదేనా?

Published on Jan 6, 2022 3:01 am IST

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు షో రెండు జంటల మధ్య చిచ్చురేపింది. హౌస్‌లో సిరి-షణ్ముఖ్‌ల ప్రవర్తన కారణంగానే దీప్తి సునయన షణ్ముఖ్‌తో బ్రేకప్ చేసుకుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి బ్రేకప్ జరిగినప్పటి నుంచి సిరి-శ్రీహాన్‌ జంట కూడా త్వరలోనే బ్రేకప్ చెప్పుకోవడం గ్యారెంటీ అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కాగా బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక సిరి-శ్రీహన్‌లు జంటగా కనిపించలేదు. అయిత సిరితో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్‌ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే శ్రీహాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేశాడు. అయితే ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి డిలీట్ చేసేశాడు. దీంతో వీరి బ్రేకప్ కూడా దాదాపు ఖాయమని నెటిజన్లు అంటున్నారు.

సంబంధిత సమాచారం :