రియల్‌ స్టార్‌ తనయుడికి హిట్ వస్తోందా ?

Published on Jun 19, 2019 2:00 am IST

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం జూలై 5న విడుదలకు సిద్ధమవుతోంది. మరి రియల్‌ స్టార్‌ తనయుడికి ఈ సినిమా హిట్ ను అందిస్తోందో లేదో చూడాలి.

అయితే హీరోగా మేఘాంశ్‌ చాల బాగా నటించాడని, అతని పాత్రకు మేఘాంశ్‌ పూర్తి న్యాయం చేసాడని తెలుస్తోంది. సినిమా ఎలా ఉన్నా.. మేఘాంశ్‌ ఇండస్ట్రీలో హీరోగా నిలబడతాడని చెప్తుంది చిత్రబృందం. మరి రియల్‌ స్టార్‌ వారసుడిగా మేఘాంశ్‌ సంచలనాలు సష్టించాలని కోరుకుందాం.

ఇక ఈ చిత్రంలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌ తదితరులు నటించగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి సంగీతం: వరుణ్‌ సునీల్‌, నిర్మాత: ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ (సత్తిబాబు). రచన, దర్శకత్వం: అర్జున్‌-కార్తీక్‌.

సంబంధిత సమాచారం :

X
More