
శ్రీమంతుడు తరువాత మహేష్ తదుపరి ప్రాజెక్ట్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ గా తెరకెక్కనున్న విషయం తెలిసినదే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దర్శకుడు విజయవాడలో లోకేషన్ల వేటలో బిజీగా వున్నట్టు సమాచారం.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై 10నుండి ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జనవరి 8కి చిత్రాన్ని విడుదలచేసే యోచనలో వున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.

