ఒక సినిమా పరాజయం పాలైతే చాలు, ఆ సినిమా దర్శకుడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, ఇక తొందరగా అతనికి అంత తేలిగ్గా అవకాశాలు రావు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ టాలెంటెడ్ దర్శకుడికి మంచి చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. శ్రీకాంత్ కి మాత్రం మరో సినిమా మొదలుపెట్టడానికి దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి శ్రీకాంత్ అడ్డాల రాసిన స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని, ఖచ్చితంగా ఈ సారి హిట్ కొట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. గతంలోనే శ్రీకాంత్ నానికి తన కథ వినిపించారని, మళ్లీ తాజాగా ఫుల్ స్క్రిప్ట్ వినిపించారని తెలుస్తోంది. శ్రీకాంత్ చెప్పిన కథ, నానికి బాగా నచ్చిందట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందేమో చూడాలి.


