టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన నెక్స్ట్ చిత్రం (#KA16) గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహించనున్నాడు. సరికొత్త కథాంశంతో, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీర్తన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ కలయికలో వస్తున్న ఈ భారీ చిత్రంపై ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది అక్టోబర్ 2026లో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
Proudly introducing the director of #KA16, Srikanth Puppala.
From shaping stories behind the scenes to leading one of his own, Srikanth Puppala embarks on his directorial journey. ✨
The journey of this ambitious film begins this October. 🎬🔥 pic.twitter.com/b0YNnRbn8d
— Zee Studios (@ZeeStudios_) June 19, 2026


