ప్రముఖ హాస్య నటుడు అలీ సమర్పణలో ఆయన తమ్ముడు ఖయ్యుమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. నూతన దర్శకుడు గౌతమ్ రాజ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సారా క్రియేషన్స్ పతాకంపై రమా గౌతమ్ నిర్మించారు. శాండీ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.
ఇక ఈచిత్రంలోని ‘షరతుల పంజరమే ‘ అనే పాట ను ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారు అనేది పాపులర్ టైటిల్. ఇప్పుడదే టైటిల్ తో నేటి జనరేషన్ కు తగ్గట్టుగా కరెంట్ ఇష్యూస్ తో దర్శకుడు ఈ సినిమా చేయటం మంచి ప్రయత్నం.నటుడిగా ఖయ్యుమ్ కు ది బెస్ట్ మూవీగా నిలవాలి. దర్శకుడి గౌతమ్ రాజ్ కుమార్ టేకింగ్ , విజువల్స్ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. టీజర్, సాంగ్ నాకు చాలా నచ్చాయన్నారు.
ఖయ్యుమ్ మాట్లాడుతూ సాంగ్ విడుదల చెసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. నటుడిగా వంద సినిమాలు చేశాను. నా కంటూ ఓ డ్రీమ్ రోల్ ఉంది. అది ఈ సినిమాలో చేశాను. టీమ్ అందరూ కష్టపడి పనిచేశారు. తల్లి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. నా లైఫ్‌లో చెప్పుకునే సినిమా అవుతుందన్నారు.
దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథను తెరకెక్కించామన్నారు.
