
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో సరికొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలను ప్రారంభించిన మహేష్ బాబు తాజాగా శ్రీమంతుడు లాంటి సినిమాతో తెలుగులో కూడా ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ ని కమర్షియల్ గా చెప్పవచ్చని, అలా చెప్పి పెద్ద హిట్ కూడా కొట్టచ్చని నిరూపించాడు. మనం పుట్టిన ఊరుని మరిచిపోకూడదు, మనతో పాటు ఆ ఊరిని కూడా డెవలప్ చెయ్యాలి, అవసరం అయతే ఆ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చెయ్యాలి అనే పాయింట్ ని ప్రేక్షకులకు అమితంగా నచ్చేలా చెప్పడంలో డైరెక్టర్ గా కొరటాల శివ సక్సెస్ అయ్యాడు.
గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. మొదటి 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఓవరాల్ గానే కాకుండా ప్రతి ఏరియాలోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సృష్టిస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం శ్రీమంతుడు కృష్ణా ఏరియాలో 3 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. మొదటి 6 రోజుల్లో శ్రీమంతుడు 2.6 కోట్ల షేర్ సాధించింది. మరో రెండు రోజుల్లో 3 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి, సెకండ్ వీకెండ్ లోపు 3.5కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంతే కాకుండా 50 కోట్ల క్లబ్ లో 3 సినిమాలు ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు రికార్డ్ సృష్టించాడు.

