
మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసినదే. సినిమా మొదలైన నాటినుండీ ఈ చిత్ర టైటిల్ పై రకరకాల ఊహాగానాలు, పుకార్లు వినిపిస్తూ సాగాయి. దాదాపు చాలా రోజులనుండి ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్ టైటిల్ నడిచినా చివరినిమిషంలో మాస్ ఆడియన్స్ కోసం, మహేష్ మూడక్షరాల సెంటిమెంట్ కోసం ఈ చిత్రానికి ‘మగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు పుకార్లు వినిపించాయి.
అయితే వాటన్నిటినీ తోసిపుచ్చుతూ ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు కొద్దిసేపటి క్రితమే దర్శకుడు స్పష్టం చేసాడు. కధానుసారం శ్రీమంతుడు టైటిల్ సరైనదని చిత్ర బృందం ఈ టైటిల్ కి మగ్గుచుపినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి శృతిహాసన్ కధానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

