చెన్నైలోనూ ‘శ్రీమంతుడు’కి మంచి రెస్పాన్స్!

చెన్నైలోనూ ‘శ్రీమంతుడు’కి మంచి రెస్పాన్స్!

Published on Aug 8, 2015 2:00 AM IST

Srimanthudu
అభిమానులకు పండగ వాతావరణాన్ని కల్పిస్తూ సూపర్ స్టార్ మహేష్ ‘శీమంతుడు’గా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ముందుకు వచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. ముందునుంచే ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉండడంతో మొదటిరోజు థియేటర్ల వద్ద అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా టిక్కెట్ల కోసం థియేటర్ల ముందు సందడి చేశారు.

ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లోని అన్ని ప్రాంతాల్లో మహేష్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక చెన్నైలోనూ ఈ సినిమాకు ఇదే స్థాయి రెస్పాన్స్ రావడం ఆశ్చర్యపరచే అంశం. తమిళంలో శ్రీమంతుడు సినిమా సెల్వందన్ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే! తమిళ వర్షన్‌కు చెన్నైతో పాటు తమిళనాడు అన్ని అర్బన్ ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో ఓ పెద్ద హీరో సినిమా స్థాయి థియేటర్లలో సెల్వందన్ విడుదలైంది. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు