‘శ్రీమంతుడు’ యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్!

‘శ్రీమంతుడు’ యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్!

Published on Aug 8, 2015 1:31 PM IST

Mahesh-srimantudu

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. ఊరిని దత్తత తీసుకోవడమనే అంశాన్ని సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీసిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ సినిమా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో కనిపించి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి.

ఇక మహేష్ సినిమాలకు స్ట్రాంగ్ కలెక్షన్లను తెచ్చిపెట్టే అమెరికాలోనూ ‘శ్రీమంతుడు’ మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. యూఎస్ ప్రీమియర్ షోస్ మొత్తం కలెక్షన్స్ చూస్తే దాదాపు 555k డాలర్లు ఉన్నాయి. మన ఇండియన్ రూపాయల్లో లెక్కేస్తే సుమారు 3.5కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇండియన్ సినిమాలో అద్భుతంగా పేరు తెచ్చుకున్న ‘బాహుబలి’ తర్వాత తెలుగులో ఈ స్థాయి కెలెక్షన్లు తెచ్చిన సినిమాగా శ్రీమంతుడు నిలిచింది. సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్లు ఇదే జోరు కొనసాగిస్తాయని ట్రేడ్ టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు