శ్రీమంతుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పై ట్రేడ్ రిపోర్ట్

శ్రీమంతుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పై ట్రేడ్ రిపోర్ట్

Published on Aug 6, 2015 9:31 PM IST

srimanthudu-poster
ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ ని తీసుకొని అందులో అభిమానులు కోరుకునే యాక్షన్ అంశాలను, యువత కోరుకునే లవ్ అండ్ కామెడీ పాయింట్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ ని మిక్స్ చేసి చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వీటన్నిటినీ సమపాళ్ళలో మిక్స్ చేసి తీసిన సినిమా ‘శ్రీమంతుడు’. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పుల్ పాజిటివ్ రిపోర్ట్ తో, అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలను అందుకోవడానికి ‘శ్రీమంతుడు’ సినిమా మరి కొద్ది గంటల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాఫై ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈ సినిమా బెనిఫిట్ షోస్ టికెట్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది.

బెనిఫిట్ షోస్ తోపాటు ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి సంబందించిన టికెట్స్ కూడా ఇప్పటికే ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయి. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 12-14కోట్ల షేర్ మార్క్ కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ పాజిటివ్ టాక్ అస్తే ఈ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా మొదటి రోజు 1 మిలియన్ టచ్ చేస్తుందని అంటున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే రీ రికార్డింగ్ అందించాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు