ఫస్ట్‌లుక్‌ను మించేలా ‘శ్రీమంతుడు’ టీజర్..!

ఫస్ట్‌లుక్‌ను మించేలా ‘శ్రీమంతుడు’ టీజర్..!

Published on May 29, 2015 1:15 PM IST

Sree-Manthudu
మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజుకు రెండు రోజుల ముందే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌లను విడుదల చేస్తారని ఇంతకు ముందే తెలియజేశారు. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఫస్ట్‌లుక్ కూడా విడుదల కాలేదు. కనీసం సినిమా టైటిల్ కూడా కన్‌ఫర్మ్ కాలేదు. దీంతో ఈ పోస్టర్, టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ రోజే మహేష్ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కావడం విశేషంగా కనిపిస్తోంది. ‘శ్రీమంతుడు’ అని ఇప్పటివరకూ వినిపించిన పేరునే ఖరారు చేశారు. ఇక ఈ పోస్టర్ విడుదలైన అతి కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. దీంతోపాటూ టీజర్ కూడా మరింత అద్భుతంగా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు టీజర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మహేష్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోరుకుంటున్న అభిమానులకు ఈ సినిమా ఆ కోరికను నెరవేరుస్తుందని సినిమా యూనిట్ టాక్. ఇక్కడ ఇప్పుడు అభిమానుల ఆసక్తంతా టీజర్‌పై పడింది. మే 31న ఉదయం 7 గంటలకు మహేష్ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

తాజా వార్తలు