శ్రీముఖి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫస్ట్ లుక్

Published on Oct 9, 2019 2:31 am IST

యంగ్ లేడీ యాంకర్, ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతుంది. గౌతమ్ ఇ వి ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, ఎస్ ఎస్ ఎస్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్టైల్ సినిమాస్ బ్యానర్స్ పై అల్లం శుభాష్, గౌతమ్ ఈ వి ఎస్, సిద్దిపల్లి సూర్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని దసరా కానుకగా నేడు విడుదల చేశారు.

చేతిలో గన్ పట్టుకొని, కళ్ళలో రొమాన్స్ కలిగిన శ్రీముఖి లుక్ విభిన్నంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం. శ్రీముఖి కిల్లర్ గా అలాగే రైటర్ గా రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ శేఖర్ మోపూరి అందిస్తుండగా త్వరలో టైటిల్ ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More