హీరో నితిన్ చేస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నారు. పనులన్నీ ఆగష్టు మొదటి వారానికి కల్లా ముగియనుండటంతో హీరో నితిన్, నిర్మాత దిల్ రాజులు ఆగష్టు 9వ తేదీకి చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.
గతంలోనే ఈ వార్త బయటికి రాగ ఈరోజు దిల్ రాజు సంస్థ నుండి అధికారిక ప్రకటన ఏదీ వెలువడింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, నందిత శ్వేతలు కథానాయకిలుగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాపై నితిన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.


