ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా రాషా తడాని హీరోయిన్ గా టాలీవుడ్ లో తమ వెండితెర ఎంట్రీని దర్శకుడు అజయ్ భూపతితో ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆన్ టైం పూర్తి అయ్యిన ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇప్పుడు విడుదలకి సిద్ధం అయ్యింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కట్ ని దింపి తమ శ్రీనివాస మంగాపురం లోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు. మెయిన్ గా దర్శకుడు అజయ్ భూపతి టేకింగ్ ఇందులో చాలా బాగుంది. మొదటి షాట్ హీరోయిన్ పై చూపించి అదే పరిస్థితిలో హీరోని కూడా చూపించి ఇద్దరి ప్రేమ కథకి ఇదొక విషాదాంతమా అన్నట్టు ముగించడం ఒక ప్రామిసింగ్ ప్రేమకథని సెటప్ చేసినట్టు అనిపిస్తుంది.
అంతే కాకుండా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ లవ్ ట్రాక్ కూడా బిగ్ స్క్రీన్స్ పై సాలిడ్ గా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. రాషాని దర్శకుడు చాలా అందంగా, అభినయంగా ప్రెజెంట్ చేయడం బాగుంది. అలాగే జయకృష్ణ కూడా తన రోల్ కి తగ్గట్టుగా మాస్ లవర్ బాయ్ లాను అలానే యాక్షన్ హీరోగా కూడా కనిపించి మెప్పించాడు.
ఇక దీనితో పాటుగా మోహన్ బాబు ట్రాక్ సినిమాలో మరింత కీలకంగా కనిపిస్తుంది. మొదటి సగం మంచి ప్రేమకథ, మిగతా సగం సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ తో సెట్ చేసి చివరిలో ఇచ్చిన ఎమోషనల్ ఎండింగ్ తో ట్రైలర్ మాత్రం మంచి ప్రామిసింగ్ గా ఉంది. ఇంకో ప్రధాన బలం ఏదన్నా ఉంది అంటే జీవి ప్రకాష్ స్కోర్ అని చెప్పాలి. లవ్, యాక్షన్ రెండు ఎమోషన్స్ ని తన స్కోర్ తో బాగా ఎలివేట్ చేశారు.
సో మొత్తానికి శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు పెట్టుకోవచ్చు అనేలా ఉంది. ఇక మొత్తం సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూలై 30 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని చందమామ కథలు, ఆనంద్ సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహించగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో విడుదలకి రాబోతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


