శ్రీను వైట్ల కు హీరో దొరికాడా ?

Published on Feb 19, 2019 4:10 pm IST

ఢీ ,రెడీ , దూకుడు చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన డైరెక్టర్ శ్రీను వైట్ల ఆ తరువాత ఆగడు , బ్రూస్ లీ , మిస్టర్ పరాజయాలతో బాగా వెనుకపడిపోయారు. అయితే రొటీన్ కు భిన్నంగా తన స్టైల్ ను మార్చి రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరసవిజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ గత ఏడాది విడుదలైన ఈ చిత్రం శ్రీను వైట్లకు అలాగే రవితేజ కు మరో డిజాస్టర్ ను అందించింది.

ఇక ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల మరో స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. అయితే స్టార్ హీరోలు ఇప్పుడు ఆయనను నమ్మి సినిమా చేసే పరిస్థితిలో లేరు కాబట్టి శ్రీను వైట్ల ఈ సారి మీడియం రేంజ్ హీరో ను సెలక్ట్ చేసుకున్నాడట. ఆయన ఎవరో కాదు మంచు విష్ణు. ‘ఆచారి అమెరికా యాత్ర’ తరువాత ఇంతవరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు విష్ణు. అయితే ఇప్పుడు ఆయన ,శ్రీను వైట్ల కు డేట్స్ ఇచ్చాడని ససమాచారం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ అలాంటి విజయాన్ని శ్రీను వైట్ల ఇస్తాడని బలంగా నమ్ముతున్నాడట మంచు విష్ణు. మరి ఈచిత్రం మళ్ళీ వీరిద్దరికి మరో ఢీ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :