
ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ తన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. “శ్రీను మంచి టాలెంట్ కలిగిన నటుడు. ఈ సినిమాలోఅతనునటించిన తీరే దీనికి సరైన ఉదాహరణ” అని తెలిపాడు
ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన సమంత నటిస్తుంది. తమన్నా ఒక ఐటెం సాంగ్ లో తళుక్కున మెరవనుంది. ఈ చిత్రానికి కామెడి ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపాడు
బ్రహ్మానందం, శ్రీను మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని తెలిపారు. రొమాన్స్ కి కూడా అధిక ప్రాధాన్యమున్న కధ అట. బ్రహ్మానందం శ్రీనుని పదేపదే అల్లుడు అని పిలుస్తాడని అందుకే అల్లుడు శ్రీను అనే టైటిల్ ని పెట్టామని తెలిపారు. ఈ సినిమాతో శ్రీను ఇండస్ట్రీకి ఘనంగా పరిచయంకావాలని కోరుకుందాం

