ఇంటర్వ్యూ : శ్రీరామ్ ఆదిత్య – దేవదాస్ తో ఫుల్ హ్యాపి !

Published on Sep 29, 2018 3:25 pm IST

‘భలే మంచి రోజు , శమంతకమణి’ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అగ్ర హీరో నాగ్, నానిలతో తెరకెక్కించిన చిత్రం ‘దేవదాస్’ . ఇటీవల విడుదలైన ఈచిత్రం విజయవంతగా ప్రదర్శించబడుతున్న సందర్బంగా శ్రీరామ్ ఆదిత్య మీడియా తో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం…

సినిమాకు రెస్పాన్స్ ఎలా వుంది ?

చాలా బాగుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా మంది బాగుంది, బాగా తీసావ్ అని మెసేజ్ పెడుతున్నారు. ట్విట్టర్, పేస్ బుక్ ద్వారా కూడా చాలా అభినందిస్తున్నారు.

అసలు ఈసినిమా ఎలా స్టార్ట్ అయింది ?

నేను ఓక 3నెలలు ఈ స్టోరీ మీద వర్క్ చేశా ముఖ్యంగా నాగార్జున గారి ఇమేజ్ అలాగే నాని గారి యాక్టింగ్ బు దృష్టిలో పెట్టుకొని ఈ కథ ప్రిపేర్ చేశా. ఆతరువాత నాగ్ గారికి నాని కి కథ చెప్పడంతో వారికీ బాగా నచ్చి చేద్దాం అన్నారు.

ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం ఇబ్బంది అనిపించలేదా ?

లేదండి, నిజం చెప్పాలంటే షూటింగ్ అంత చాలా సరదాగా గడిసిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలను మానిటర్ లో చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇబ్బంది ఉండదు. నాకు వారితో ఎలాంటి ఇబ్బంది రాలేదు.

ఈసినిమాకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ?

నాగార్జున గారు సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను అని అన్నారు. నాకు వచ్చిన ఫస్ట్ కాల్ ఆయనదే. ఆయన ఆలా అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది.

ఈ సినిమాకు సీక్వెల్ ఏమైనా వుంటుందా ?

లేదండి. ఉంటే బాగుంటుంది ఇంకా ఏం అనుకోలేదు. మళ్ళీ అదే టీం తోని చేస్తే చాలా సరదాగా ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవు.

తదుపరి చిత్రాల గురించి ?
ప్రస్తుతానికైతే ఇంకేం అనుకోలేదు. దేవదాస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న. గత ఏడాది గా ఈచిత్రం కోసం కష్టపడ్డాం. దానికి తగిన ఫలితం వచ్చింది.

సంబంధిత సమాచారం :