నేడు 500 కోట్ల క్లబ్ లో చేరనున్న షారుఖ్ “పఠాన్”

Published on Feb 21, 2023 2:03 pm IST

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయినప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం డ్రాప్ లేకుండా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తూ, భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం సోమవారం మరో 1.2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ 498.9 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

అయితే ఈరోజు తో ఈ చిత్రం 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. దీంతో బాహుబలి 2 తర్వాత నార్త్ లో 500 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం గా నిలవనుంది. ఈ చిత్రం లో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :