వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకు పోతున్న “పఠాన్”

Published on Feb 8, 2023 11:59 pm IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. హీరో షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా 1000 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకు పోతుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 865 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో 1000 కోట్ల రూపాయల క్లబ్ లోకి పక్కగా చేరుతుంది అని తెలుస్తోంది. ఇప్పటి వరకు దంగల్, బాహుబలి 2, RRR మరియు కేజీఎఫ్ 2 సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. ఈ చిత్రంలో దీపికా పదుకునే, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో ఆకట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :