అందాల భామ శృతి హాసన్ ఈ సంవత్సరం మొట్ట మొదటి హిట్ ‘ఎవడు’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమాలోని మాస్ నెంబర్ ‘పింపుల్ డింపుల్’ సాంగ్ కూడా అంతే హిట్ అయ్యింది. ఈ పాటలో శృతి తన గ్లామర్ డోస్ ని పెంచి మరీ స్టెప్పులు వేసింది. ఇటీవలే ఈ పాటలోని కొన్ని హాట్ హాట్ వర్కింగ్ స్టిల్స్ ని మీడియాలోకి వదిలారు. ఈ ఫోటోలు సంచలనం సృష్టించాయి.
బాగా అసభ్యకరంగా ఉన్న ఈ ఫోటోలపై ఎట్టకేలకు శృతి హాసన్ స్పందించింది. ‘పింపుల్ డింపుల్ సాంగ్ షూట్ లో ఉన్నప్పుడు తీసిన వర్కింగ్ స్టిల్స్ అవి, వారిని అసభ్యకరమైన యాంగిల్స్ లో అంతా తీసారు. వాటిని పబ్లిష్ చేయకూడదు. అలా పబ్లిష్ చేయాలి అంటే నాది లేదా ఎవడు మూవీ టీం పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా చీప్ పబ్లిసిటీ కోసం ఎవరో వాటిని రిలీజ్ చేసారు. ఈ ఫోటోలు చూసిన చాలా మంది ఎందుకు అలాంటి ఫొటోస్ రిలీజ్ చేసావ్ అని అడుగుతుంటే సమాధానం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ విషయంపై హైదరాబాద్లో కంప్లైంట్ ఫైల్ చేస్తాను. దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని బయటకి లాగుతానని’ శృతి తెలిపింది.


