
సౌత్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’. ఈ రెండు సినిమాల్లోనూ మెయిన్ లీడ్ రోల్ పాత్రలు పోషిస్తున్న సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుష్క. అనుష్క రుద్రమడేసి షూటింగ్ గత ఏడాది ఫిస్నిష్ చెయ్యగా, బాహుబలికి సంబందించిన షూటింగ్ ని ఈ ఏడాది ఫినిష్ చేసింది. ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసిన తర్వాత అనుష్క వరుసగా తన తదుపరి సినిమాలకు సైన్ చేస్తోంది. పివిపి సినేమాస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇది వరకే తెలియజేశాం.
పివిపి బ్యానర్ లో అనుష్క లీడ్ రోల్ చేయనున్న సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ప్రకాష్ గతంలో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ ఆర్జు అధికారికంగా మొదలైంది. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఓ అతిధి పాత్రలో కనిపించనుంది. ఆర్య, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి సైజ్ జీరో అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

