Pic Talk: ఫ్రాన్స్‌లో రాజమౌళి, శోభు యార్లగడ్డ.. ఆనెసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సందడి!

Pic Talk: ఫ్రాన్స్‌లో రాజమౌళి, శోభు యార్లగడ్డ.. ఆనెసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సందడి!

Published on Jun 24, 2026 5:00 PM IST

ముఖ్య అంశాలు

  • ప్రముఖ ఇంటర్నేషనల్ ఈవెంట్ ‘ఆనెసీ ఫిల్మ్ ఫెస్టివల్’లో (Annecy Film Festival) దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ఎస్.ఎస్. కార్తికేయ సందడి చేశారు.
  • ఈ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ (WIP) ప్యానల్‌తో పాటు గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.
  • ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న శోభు యార్లగడ్డ.. రాజమౌళి, కార్తికేయలతో కలిసి ఫెస్టివల్ వేదిక ముందు దిగిన ఫోటోను షేర్ చేశారు.

గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన దర్శకధీరుడు రాజమౌళి, ప్రతిష్టాత్మక ‘ఆనెసీ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో (Annecy Film Festival) పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం జక్కన్నతో పాటు ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాత శోభు యార్లగడ్డ, ఎస్.ఎస్. కార్తికేయ కూడా అక్కడికి వెళ్లారు. ఈ ముగ్గురూ కలిసి ఫెస్టివల్ వేదిక ముందు ఉత్సాహంగా ఫోటోలకు పోజులిచ్చారు.

ఈ ట్రిప్‌కు సంబంధించిన పిక్‌ను నిర్మాత శోభు యార్లగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. రాజమౌళి, కార్తికేయ, బాహుబలి అఫీషియల్ అకౌంట్స్‌ను కొలాబరేట్ చేస్తూ ఆయన ఈ అప్‌డేట్ ఇచ్చారు. అసలు ఈ ఫెస్టివల్‌కు వీళ్లంతా ఎందుకు వెళ్లారంటే.. అక్కడ మన ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ (WIP) ప్యానల్ డిస్కషన్ జరగనుంది. బాహుబలి యానిమేషన్ సిరీస్ కి సంబంధించిన కీలక విషయాలను ఇక్కడ చర్చించబోతున్నారు.

దీంతో పాటు ఫెస్టివల్‌కు వచ్చిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం సెన్సేషనల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) స్పెషల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు. వరల్డ్ బెస్ట్ క్రియేటర్స్ హాజరయ్యే ఇలాంటి వేదికపై మన సినిమాల గురించి స్పెషల్ డిస్కషన్స్, స్క్రీనింగ్స్ జరగడం తెలుగు ప్రేక్షకులకు నిజంగా గర్వకారణం. ప్రస్తుతం రాజమౌళి, శోభు యార్లగడ్డలకు సంబంధించిన ఈ ఆనెసీ ఫెస్టివల్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా వార్తలు