‘రాజమౌళి – మహేష్’ సినిమా పై మరో రూమర్ !

Published on Jun 20, 2021 3:02 am IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నానని, ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడం, లాక్ డౌన్ పడటంతో మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి రూమర్ రాలేదు. కానీ తాజాగా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి మొదలు పెట్టే ఆలోచనలో జక్కన్న ఉన్నారని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో మహేష్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తాడట. ఆ సినిమా తరువాత రాజమౌళి సినిమా మీదకు వెళ్తాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :