SSMB 28 : అన్ని ప్రశ్నలకు సమాధానం లభించేది ఆ రోజునే ?

SSMB 28 : అన్ని ప్రశ్నలకు సమాధానం లభించేది ఆ రోజునే ?

Published on Mar 31, 2023 12:30 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంల తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ SSMB 28 పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ లో అలానే సాధారణ ఆడియన్స్ లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మహేష్ బాబు చాలా గ్యాప్ తరువాత సూపర్ మాస్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీ కి సంబందించిన నెక్స్ట్ అప్ డేట్ ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజైన మే 31న అందించనున్నట్లు ఇప్పటికే SSMB 28 మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక మరోవైపు ఈ మూవీకి సంబంధించి రెండు సాంగ్స్ మాత్రమే రికార్డింగ్ జరిగిందని, అలానే మూవీ టైటిల్ పై పలు టైటిల్స్ పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని, టీజర్ ని ఫలానా రోజున రిలీజ్ చేయనున్నారు అంటూ పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కాగా తమ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఏమాత్రం వాస్తవం లేదని, అలానే మూవీకి వివరాలను మే 31న అప్ డేట్ ద్వారా ప్రకటిస్తాం అంటూ యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి మూడవసారి సూపర్ స్టార్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరొక ఎనిమిది నెలలు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు