కాజల్ అగర్వాల్ పై కంప్లైంట్ చేసిన తమిళ హీరో

కాజల్ అగర్వాల్ పై కంప్లైంట్ చేసిన తమిళ హీరో

Published on Sep 9, 2014 1:02 PM IST

kajal-stalin
తమిళ హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కాజల్ అగర్వాల్ పై తమిళ చిత్ర నిర్మాతల సంఘంలో కంప్లైంట్ చేశారు. ‘నన్బెండా’ అనే చిత్రంలో నటించేందుకుగాను కాజల్ అగర్వాల్ కు 40 లక్షల రూపాయలను అడ్వాన్సుగా చెల్లించారు. ఆ సినిమాలో కాజల్ నటించలేదు. తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా నిర్మాతల సంఘంను ఉదయనిధి స్టాలిన్ కోరారు.

‘నన్బెండా’లో ఉదయనిధి స్టాలిన్ సరసన హీరోయిన్ గా నయనతార నటించింది. అయితే కాజల్ అగర్వాల్ 40 లక్షల రూపాయల అడ్వాన్సు తిరిగి ఇవ్వకుండా ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకేక్కబోయే తర్వాత సినిమాలో నటించేలా కాజల్ ఒప్పందం చేసుకుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో 40 లక్షలను ఇవ్వవలసిందిగా ఉదయనిది స్టాలిన్ కోరుతున్నారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగులో ‘గోవిందుడు అందరివాడేలే’, ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ సినిమా, తమిళంలో మరొక సినిమాలో నటిస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక హిందీ సినిమాలో నటించే అవకాశం వదులుకుంది. అయితే ఉదయనిధి నెక్స్ట్ సినిమాలో హన్సిక నటిస్తుంది అంటూ చెన్నై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

తాజా వార్తలు