పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినిమా పరంగా అలాగే రాజకీయాలు పరంగా కూడా ఏ స్థాయిలో వ్యక్తిత్వ హననం జరిగిందో తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా తెలుసు. తన నుంచి ఎప్పుడూ ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు రాలేదు కానీ ఇప్పటికీ పవన్ పై తన కుటుంబంపై పర్శనల్ గా అనేకమంది అనేక కామెంట్స్ చేస్తూ వచ్చారు.
అలా ఇటీవల ఓ తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల, పవన్ ఇంకా నిహారిక కొణిదెలల వ్యక్తిగత జీవితాల విషయంలో గీత దాటడం సంచలనంగా మారింది. దీనితో పవన్ అభిమానులు నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. దీనితో సదరు కమెడియన్ ఇప్పుడు ఓ వీడియో బైట్ విడుదల చేసి తన తప్పుకి క్షమాపణ కోరుతున్నట్టు తెలిపాడు. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉంటాను అని వీడియో ద్వారా తెలిపాడు. దీనితో ఈ కాంట్రవర్సీ కొంచెం సర్దుమణిగింది.
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 12, 2026
