చిరంజీవి సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న స్టార్ నటుడు !

Published on Jul 2, 2018 1:19 pm IST

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతితో పాటు భోజ్ పురి స్టార్ నటుడు రవి కిషన్ కూడ నటిస్తున్నారు. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ చిరంజీవిగారికి, తనకు మధ్యన భారీ ఫైట్ సీన్స్ ఉంటాయని, సినిమాలో తన పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. అలాగే సురేందర్ రెడ్డి తనకు గాడ్ ఫాథర్ లాంటి వారని, ఆయన వలనే తెలుగు సినిమాల్లోకి ప్రవేశించానని అన్నారు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడ రానుంది.

సంబంధిత సమాచారం :